అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరగనుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి ఈ భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో అక్టోబర్‌ 1న సమావేశం జరగనుంది.

సెప్టెంబర్‌ 3న నిర్వహించిన మంత్రివర్గం సమావేశంలో ‘ఉచిత విద్యుత్‌– నగదు బదిలీ’ అంశంపై చర్చ జరిగింది. రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం, రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి, ఏపీఎస్‌డీసీకి ఆమోదం, వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్‌ సిగ్నల్‌ వంటి పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.