Asianet News TeluguAsianet News Telugu

జగన్ వ్యూహాత్మకం.. టీటీడీ కొత్త బోర్డుపై చట్ట సవరణ, ఎల్లుండి కేబినెట్ భేటీలో అజెండా ఇదే

ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి విషయం లో కీలక నిర్ణయం తీసుకోనుంది. బోర్డులో 52 మంది సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి చట్ట సవరణకే కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. 

ap cabinet meeting fixed on 28th october
Author
Amaravati, First Published Oct 26, 2021, 10:35 AM IST

ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి విషయం లో కీలక నిర్ణయం తీసుకోనుంది. బోర్డులో 52 మంది సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి చట్ట సవరణకే కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. వచ్చే నవంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేసే అవకాశం వుంది. టీటీడీ బోర్డు సభ్యులుగా 52 మంది నియామకం సహా ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చట్టసవరణకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్ సమావేశం ఎజెండాలో టీటీడీ పాలకమండలి ఎజెండాను చేర్చింది. 

టీటీడీ బోర్డులో (ttd board) సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (ap govt) జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ బీజేపీ (bjp) నేత భానుప్రకాశ్‌రెడ్డి (Bhanu Prakash reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్ 6న హైకోర్టులో (ap high court) విచారణ జరిగింది. ప్రస్తుతం బోర్డు నియమించిన 24 మంది సభ్యుల్లో 14 మందిపై నేరారోపణలు ఉన్నాయని వాదించారు. రాజకీయ నేపథ్యం ఉన్న నలుగురిని సభ్యులుగా నియమించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశ్విన్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. 18 మంది సభ్యులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం 18 మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని నాడు న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ALso Read:టీటీడీ బోర్డు నియామకంపై వివాదం: 18 మంది సభ్యులకు హైకోర్టు నోటీసులు

కాగా, సెప్టెంబర్ 15వ తేదీన జీవో 245 ద్వారా 25 మంది పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. జీవో 568 ద్వారా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. జీవో 569 ద్వారా ఇద్దరిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. ఈ జంబో కార్యవర్గంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయమై బీజేపీ నేతలు ఏపీ గవర్నర్‌కి (ap governor) కూడా ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత ఉమామహేశ్వరనాయుడు, హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు జి. లలిత్ కుమార్ లు టీటీడీలో జంబో పాలకవర్గం ఏర్పాటు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మూడు పిటిషన్లపై ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 22న విచారణ నిర్వహించింది. అనంతరం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios