ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2 లక్షలు జరిమానా: ఏపీ కేబినెట్ నిర్ణయం
ఇసుక అక్రమ రవాణా చేస్తూ దొరికితే కనీసం జరిమానా రూ.2 లక్షల రూపాయలతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణకు ఆమోదముద్ర వేసింది.
ఇసుక నిల్వ చేసినా అక్రమంగా రవాణా చేసినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా, పునర్విక్రయం చేసినా కఠినచర్యలు తీసుకునేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది.
ఇసుక అక్రమ రవాణా చేస్తూ దొరికితే కనీసం జరిమానా రూ.2 లక్షల రూపాయలతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణకు ఆమోదముద్ర వేసింది. మంత్రి వర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
ఇసుక డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలో ఒక వారం పాటు ప్రభుత్వంలోని కొన్ని యంత్రాంగాలను రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ రీచ్‌ల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించినట్లుగా నాని తెలిపారు.
Also Read:Pawan: జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోతారు: పవన్ కల్యాణ్ శాపనార్థాలు
ప్రతి రోజు లక్షా యాభైవేల నుంచి రెండు లక్షల టన్నుల వరకు ఇసుక లభ్యత ఉండేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో ఉన్న 9 వేల పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని నాని పేర్కొన్నారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
* రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమంతో పాటు తెలుగు లేదా ఉర్దూ కచ్చితంగా చదివేట్లు చర్యలు
* తల్లిదండ్రులు,విద్యా కమిటీల నుంచి అభిప్రాయాల స్వీకరణ తర్వాత ఇంగ్లీష్ మీడియం అమలు
* ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారులకు 10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర
* మొక్కజోన్న కోసం కొనుగోలు కేంద్రాలు. విజయనగరం, కర్నూలు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు
* పట్టణాల్లో అనధికార లే అవుట్ లను క్రమబద్దీకరణకు నిర్ణయం
* ఏపీ సోలార్ పవర్ పాలసీ- 2018, విండ్ పవర్ పాలసీ- 2018 లలో సవరణలకు గ్రీన్‌సిగ్నల్
* గ్రామ స్థాయిలో వివాదాల పరిష్కారానికి గ్రామ న్యాయాలయాల ఏర్పాటు. 84 చోట్ల గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఆమోదం
*రాష్ట్రంలో 8 ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లు ఏర్పాటు
1). శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్ధానం– సింహాచలం
2). శ్రీ వీరవెంటక సత్యన్నారాయణ స్వామి దేవస్ధానం – అన్నవరం
3). శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్ధానం – ద్వారకా తిరుమల
4). శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానం – విజయవాడ
5). శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి దేవస్ధానం – శ్రీకాళహస్తి
6). శ్రీ భ్రమరాంభా మల్లేశ్వరస్వామి దేవస్ధానం– శ్రీశైలం
7). శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్ధానం – పెనుగంచిప్రోలు
8). శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి దేవస్ధానం– కాణిపాకం
* ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణకు కేబినెట్ ఆమోదం.
* హోంశాఖలో అదనపు పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.
* ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లా చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదముద్ర
Also read:పవన్ లాంగ్ మార్చ్ చూసి వైసీపీ వణికిపోయింది: టీడీపీ నేత బోండా
కాగా ఇసుక కొరతకు స్వయంగా కారకుడైన టిడిపి అధ్యక్షులు, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇసుక పేరుతో దీక్ష చేయడం విడ్డూరంగా వుందని వైసిపి అధికార ప్రతినిధి,పెనమలూరు ఎంఎల్ఏ కొలుసు పార్ధసారధి ఎద్దేవా చేశారు.