మెగా డీఎస్సీ , పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుకు గ్రీన్ సిగ్నల్ .. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మెగా డీఎస్సీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మెగా డీఎస్సీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేబినెట్ కీలక నిర్ణయాలు:
- నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర
- శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ఆమోదం
- ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు అనుగుణంగా చట్టంలో సవరణకు కేబినెట్ ఆమోదం
- యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు
- మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్‌సిగ్నల్ , మొత్తం 6100 పోస్టుల భర్తీకి ఆమోదం
- అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
- ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత 4వ విడత నిధులకు ఆమోదం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు ఆమోదం
- ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఓకే
- ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేలా తీసుకున్న ప్రతిపాదనకు ఆమోదం
- ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి ఆమోదముద్ర