అమరావతి: ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ పథకానికి ఏపీ కేబినెట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది.వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కు ఎలాంటి ఢోకా ఉండదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం గురువారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించారు.

also read:వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు: ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం వివరణ ఇదీ..

వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్  మీటర్లు  బిగించడం వల్ల ఇబ్బంది లేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఒక్క కనెక్షన్ కూడ తొలగించబోమని ఈ సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రైతుపై ఒక్క పైసా అదనంగా భారం పడదని ఆయన స్పష్టం చేశారు. 30 నుండి 35 ఏళ్ల వరకు ఉచిత విద్యుత్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక పథకాలు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్, గాలేరు, నగరి నుండి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం యురేనియం ప్రభావిత గ్రామాల్లో ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై చర్చించారు.