ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 41,436 కోట్లతో వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి కాకాణి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి ప్రసంగిస్తూ.. ఏపీ సీడ్స్‌కు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయని చెప్పారు. విత్తనాల రాయితీకి రూ. 200 కోట్లు కేటాయించినట్టుగా తెలిపారు. ఆర్బీకేల ద్వారా రూ. 450 కోట్ల విలువైన ఎరువుల సరఫరా చేస్తున్నానమి చెప్పారు. ఆర్బీకేల్లో 50 వేల టన్నుల ఎరువులను నిల్ల చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పంటల ప్రణాళిక, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపారు. 

రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్భీకే సేవలు అందిస్తున్నాయని తెలిపారు. రైతులకు కావాల్సిన అన్ని సేవలను గ్రామస్థాయిలోనే అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8,837 ఆర్బీకే భవనాల నిర్మాణాలు వివిధ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆర్మీకేలను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. 

రైతు భరోసా కింద ఇప్పటి వరకు రైతులకు రూ. 6, 940 కోట్లు అందించామని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా కరవు, కాటకాలను రాలేదని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిశాయని.. వాటర్‌ గన్స్ అవసరమే రాలేదని పేర్కొన్నారు. రూ. 6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేశామని తెలిపారు. 9 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. చిరుధాన్యాల సమగ్ర సాగు విధానం తీసుకొచ్చామని తెలిపారు.