రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేయతలపెట్టిన దీక్ష విషయంగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కొందరు స్థానిక నేతలను తమ దగ్గరికి పంపించి మీడియాకు లీకులిస్తున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ దృష్టిలో టీడీపీ. చంద్రబాబు అంటరాని వాళ్లని.. ఆయన చేసిన ద్రోహాన్ని బీజేపీ ఎప్పటికీ మర్చిపోదన్నారు.

Also Read:దీక్షకు అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయి... చంద్రబాబు లేఖ

బాబు తాము 240 కిలోమీటర్లు దూరంగా ఉంటామని.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ లిమిటెడ్ కంపెనీగా మారిపోయి నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలే ఆ పార్టీని ఏలారని.. ఏపీ రాజకీయాల్లో టీడీపీది ముగిసిన అధ్యాయమని విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, లోకేశ్ తప్ప ఏ బలమైన నాయకుడు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతున్న సంగతి తనకు తెలియదని విష్ణువర్థన్ రెడ్డి వెల్లడించారు.

Also Read:చంద్రబాబుకు షాక్ ఖాయమేనా...? రామ్ మాధవ్ తో గంటా భేటీ

బాబు ఎన్ని దీక్షలైనా చేసుకోవచ్చని.. ఆయన దీక్షకు తాము సంఘీభావం మాత్రమే తెలియజేశాం తప్పించి.. ఆ కార్యక్రమంలో పాల్గొనడం లేదని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. 

తెలుగు దేశం పార్టీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి షాకిచ్చేందుకు బిజెపి పార్టీ రంగం సిద్దం చేస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఇప్పటికే బిజెపి నేతలు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

తాజాగా గంటా డిల్లీలో బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి రాంమాధవ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ గంటా టిడిపిని వీడి భారతీయ జనతా పార్టీలో చేరతాడన్న ప్రచారానికి మరింత బలాన్నిస్తోంది. 

ప్రస్తుతం డిల్లీ పర్యటనలో వున్న గంటా శ్రీనివాసరావు తాజాగా రామ్ మాధవ్ ను కలుసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో ముఖ్యంగా టిడిపి లో రాజకీయ వాతావరణ వేడెక్కింది. ఈ భేటీకి సంబంధించిన వివరాలేవీ బయటకు రాకున్నా బిజెపి చేరేముందు తన డిమాండ్లను రామ్ మాధవ్ ముందుంచేందుకే గంటా కలిసినట్లు ప్రచారం సాగుతోంది.  

గత గురువారం  కూడా గంటా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న గంటా సుజనా, సీఎం రమేశ్‌తో కూడా చర్చలు జరిపారు.