దీక్షకు అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయి... చంద్రబాబు లేఖ

12 గంటల ఇసుక దీక్షకు ఇప్పటికే అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయని తెలంగాణలో ఆర్‌టిసి సమస్యపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నాట్లు చెబుతూ.. అలాగే, మన రాష్ట్రంలోను ఇసుక సమస్య వల్ల నష్టపోతున్న 125 వృత్తులు, వ్యాపార రంగాల ప్రతినిధులు కూడా ఈ దీక్షలో భాగస్వాములు కావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ విడుదల చేశారు. 

Chandrababu's open letter on andhrapradesh issues

11-11-2019 

గుంటూరు.

బహిరంగ లేఖ

గౌ|| ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు

    ప్రకృత్రి ప్రసాదించిన వరం ఇసుక. దాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.కనుకనే తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టింది. దీనివల్ల ఇసుక కొరత లేకపోవడమేకాక రేట్లు కూడా అందుబాటులో వుండేవి. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చింది. దీనివల్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇసుక కృత్రిమ కొరత సృష్టించి 30 లక్షల మంది  కార్మికులను, ఆకలితో అలమటించే పరిస్థితి కల్పించారు. పనులు లేవు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పిల్లల స్కూల్‌ ఫీజులు కూడా చెల్లించలేక అర్ధాంతరంగా కొందరు చదువులు ఆపేయించారు. భార్యా పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నామని మరికొందరు  మొత్తం 40 మందికి బలవన్మరణాల పాలయ్యారు. ఇసుక కృత్రిమ కొరత వల్ల పెరిగిన రేట్ల వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైంది. దీనివల్ల 125 వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నవి. వీరందరికీ మనో ధైర్యం కలిగించి ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి అమలు చేయాలని, పనిచూపే వరకు కార్మికులకు రూ.10 వేలు భృతి ఇవ్వాలని, ప్రభుత్వం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని నేను విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద నవంబర్‌ 14న 12 గంటలు నిరసన దీక్షను చేపడుతున్నాను.

        ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఇసుక మాఫియాను తెలుగుదేశం ప్రభుత్వం కట్టడి చేసింది. అలాంటి ఉచిత ఇసుకను రద్దు చేసి వైసీపీ నేతలే ఇసుక మాఫియాను ప్రోత్సహించేలా చేశారు. తెలుగుదేశం హయాంలో రూ.10వేలకు లభించిన లారీ ఇసుక నేడు రూ.50వేల నుంచి రూ.లక్షకు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతూ సామాన్యులను దోచుకుంటున్నారు. వరదల కారణంగానే ఇసుక కొరత అంటూ అబద్దాలు చెబుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఇసుక కొరత ఇక్కడే ఎందుకు వచ్చింది.? రాష్ట్రంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలని తాపత్రయపడుతున్న సామాన్యులకు ట్రాక్టర్‌ ఇసుక దొరకడం లేదు. కానీ.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు వందలాది లారీల ఇసుకను యధేచ్ఛగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి పట్ల మానవత్వాన్ని మరచి మంత్రులు అపహాస్యం చేస్తూ.. మాట్లాడడం తప్ప.. కొరతను ఎలా సాధించాలనే ఆలోచన చేయడం లేదు.

12 గంటల ఇసుక దీక్షకు ఇప్పటికే అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో ఆర్‌టిసి సమస్యపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నాయి. అలాగే, మన రాష్ట్రంలోను ఇసుక సమస్య వల్ల నష్టపోతున్న 125 వృత్తులు, వ్యాపార రంగాల ప్రతినిధులు కూడా ఈ దీక్షలో భాగస్వాములు కావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.

(నారా చంద్రబాబునాయుడు)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios