నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేస్తోంది ఏపీ బీజేపీ. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీపై దూకుడు పెంచాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. 

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీపై దూకుడు పెంచడం కాదని రాష్ట్ర అభివృద్ధిపైనా, పాలనపైనా దూకుడు పెంచాలంటూ హితవు పలికింది. వాస్తవానికి జోష్, దూకుడు పరిపాలన బడ్జెట్ విషయంలో చూపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి స్పష్టం చేశారు. 

ప్రభుత్వాన్ని రద్దులు, వాయిదాల ప్రభుత్వంగా మార్చొద్దని ఆంజనేయరెడ్డి హితవు పలికారు. మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా పేలవంగా ఉందని విమర్శించారు. సంక్షేమానికి చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారంటూ విరుచుకుపడ్డారు. నాలుగు లక్షల ఇళ్లు రద్దు చేయడం సరికాదంటూ ప్రభుత్వానికి సూచించారు.