Asianet News TeluguAsianet News Telugu

దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..? దీదీని అరెస్ట్ చెయ్యాలి : వెస్ట్ బెంగాల్ దాడిపై కన్నా ఫైర్

హింస ద్వారా అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల పోకడ దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని విరుచుకుపడ్డారు. మమతాబెనర్జీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. 

ap bjp president kanna laxmi narayana fires on mamata benerjee
Author
Vijayawada, First Published May 15, 2019, 3:44 PM IST

విజయవాడ: పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. కోల్ కతాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై జరిగిన దాడి విచారకరమన్నారు.

హింస ద్వారా అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల పోకడ దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని విరుచుకుపడ్డారు. మమతాబెనర్జీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని మమతా బెనర్జీని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే రాష్ట్రాలు వారి జాగీరుగా భావిస్తున్నాయంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాంలో ఇది మంచి పరిణామం కాదన్నారు. 

బీజేపీపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, అయినా ప్రజలు బీజేపీకే మద్దతు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇకపోతే ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాపై జరిగిన దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios