ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాఫెల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇకనైనా చంద్రబాబుకు కనువిప్పుకలగాలని విమర్శించారు. రాఫెల్ పిటిషన్ల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ శుక్రవారం ఇచ్చిన తీర్పుపై కన్నా హర్షం వ్యక్తం చేశారు. 

ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు పెద్ద స్కాం బయటపెడతానని చెప్పి లేని కుంభకోణాన్ని సృష్టించారని ఆరోపించారు. ఏనుగు పోతుంటే కుక్కుల మొరుగుతుంటాయని ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా కంపెనీ అన్న ఆయన ఆ కంపెనీకి డైరెక్టర్‌ చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి పట్టించుకోవడానికి ప్రజలు సిద్దంగా లేరన్నారు. 

ఈ సందర్భంగా దేశంలో దొంగలు పడ్డారు వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొందరు బురదలో దొర్లి దానిని ఇతరులకు అంటిచాలని ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ స్నేహం చేస్తే తెలంగాణలో చేతులు కాలినట్లు మళ్లీ కాల్చుకుంటారన్నారు. 

కాపు, వాల్మీకి రిజర్వేషన్ల గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జయల్‌ ఓరంతో చర్చించినట్లు తెలిపారు. చంద్రబాబు వారిని ఏవిధంగా మోసం చేశాడో వివరించినట్లు చెప్పారు.  త్వరలో రిజర్వేషన్లపై క్లారిటీ వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

రాఫెల్ స్కాం: సుప్రీం తీర్పుపై అనిల్ అంబానీ కామెంట్స్

రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: రాహుల్ క్షమాపణకు షా డిమాండ్

రాఫెల్ డీల్.. మోదీ ప్రభుత్వానికి ఊరట