అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వెండి రథానికి చెందిన మూడు సింహాలు అదృశ్యమైన ఘటనపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడిలో రథాన్ని బీజేపీ నేతలతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. రథం గురించి వివరాలను ఈవో సురేష్ బాబును బీజేపీ నేతలు అడిగి తెలుసుకొన్నారు. 

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వెండి రథానికి చెందిన సింహాల ప్రతిమలు మాయమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆరోపించారు. దుర్గమ్మ  రథంపై నాలుగో సింహాన్ని కూడ తొలగించేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై విచారణకు ఆదేశించినట్టుగా ఈవో సురేష్ బాబు చెప్పారు.  

వీడియో

"