టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. మోడీని చంద్రబాబు పొగడటం సంతోషమన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు , పవన్ భేటీ గురించి తెలియదన్నారు. పొత్తుల అంశంపై నాదెండ్ల మనోహర్‌ను అడగాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. మోడీని చంద్రబాబు పొగడటం సంతోషమన్నారు.
మరోవైపు.. టీడీపీ జనసేనపై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతరించి పోతున్న టీడీపీతో కలిస్తే జనసేనకూ పతనావస్థేనని కొట్టు జోస్యం చెప్పారు. చంద్రబాబును నమ్మి రాజకీయంగా పవన్ పతనమవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముందు మీరు సీఎం అభ్యర్ధి ఎవరో తేల్చుకోవాలని కొట్టు సత్యనారాయణ చురకలంటించారు. ఎన్టీఆర్ వీరాభిమానులంతా వైసీపీలోనే వున్నారని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలను అశాంతికి గురిచేసేలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read : టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. ఏపీ రాజకీయాల్లో కలకలం
కాగా.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించారు. ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన దాడి నేపథ్యంలో చంద్రబాబుకు పవన్ సంఘీభావం ప్రకటించారు.
