టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. శనివారం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చిస్తున్నారు. వీరిద్దరి భేటీ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో పవన్ సమావేశం కావడం ఇది మూడోసారి. ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడి చేసిన నేపథ్యంలో పవన్ ఈయనకు సంఘీభావం తెలిపారు.