భిన్నాభిప్రాయాలు సహజం.. జనసేనతో మిత్రపక్షంగానే వుంటాం: సోము వీర్రాజు వ్యాఖ్యలు

జనసేనకు ఒక పాలసీ  వుందని.. తమకు కూడా ఒక పాలసీ వుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ కుటుంబ  రాజకీయాలను ప్రోత్సహించదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

ap bjp chief somu veerraju comments on janasena party

జనసేనకు ఒక పాలసీ  వుందని.. తమకు కూడా ఒక పాలసీ వుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ కుటుంబ  రాజకీయాలను ప్రోత్సహించదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. భిన్నాభిప్రాయాలు సాధారణమని.. జనసేనతో మిత్రపక్షంగా  కొనసాగుతామని ఆయన అన్నారు. చనిపోయిన అభ్యర్ధి  భార్యకి నామినేటెడ్ పదవి ఇవ్వొచ్చు కదా అని వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రచారానికి పవన్‌ను ఆహ్వానిస్తామని.. వస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. టీడీపీ, జనసేన దగ్గరవుతుందనే దానిపై తాను ప్రస్తుతం మాట్లాడనని  వీర్రాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు  ప్రత్యేక హోదా  వద్దు అన్నారని.. అందుకే ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. 

బద్వేలు ఉప ఎన్నిక విషయంలో పవన్ కల్యాణ్ నిర్ణయంతో బిజెపి విభేదించి తమ అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సోము వీర్రాజు కూడా నిర్ధారించారు. తమ మిత్రమపక్షమైన జనసేనకు బిజెపి బద్వేలు సీటును కేటాయించింది. అయితే, వైసీపీ అభ్యర్థి దాసరి సుధను ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశ్యంతో పోటీకి దూరంగా ఉండాలని జనసేన నిర్ణయం తీసుకుంది.

ALso Read:సోము వీర్రాజు నో కామెంట్: చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దగ్గరవుతున్నారా?

అనారోగ్య కారణాలతో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఇటీవల కాలంలో మరణించారు. దీంతో ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన  ఓబులాపురం రాజశేఖర్  (obulapuram rajasekhar)నే టీడీపీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. రాజశేఖర్  ప్రచారం నిర్వహిస్తున్నారు. వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధకు (dasari sudha) వైసీపీ టికెట్ ఇచ్చింది. దీంతో మృతి చెందిన కుటుంబానికి అధికార పార్టీ సీటు ఇచ్చినందున గత సంప్రదాయాల ప్రకారంగా పోటీకి దూరంగా ఉండాలని టీడీపీలో కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగానే టీడీపీ పొలిట్‌బ్యూరో  పోటీకి దూరంగా వుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios