విజయవాడ: టీడీపీ కీలక నేత, మాజీఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరుతున్నారనే అంశం తనకు తెలియదన్నారు. 

రాయపాటి తనను సంప్రదించలేదని, అసలు ఆ విషయమే తనకు తెలియదని కేవలం మీడియాలో మాత్రమే చూశానని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ బీజేపీలోకి వలసలు మాత్రం వస్తూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. 

మరోవైపు తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదన్నారు. వైసీపీపై విమర్శలు చేయాల్సిన అవసరం కూడా తమకు లేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులను మాత్రం ప్రజాక్షేత్రంలో ఖండిస్తామని కన్నా లక్ష్హీనారాయణ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వలసలు జనసేన, టీడీపీ నుంచే, తేల్చేసిన బీజేపీ చీఫ్ : ఊపిరిపీల్చుకున్న వైసీపీ