శాసనసభ శీతాకాల సమావేశాలను డిసెంబరు మొదటి వారంలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి రెండ్రోజుల్లో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.  ఈ సమావేశాల్లో కీలకమైన ఇసుక విధానంతో పాటు ఇతర బిల్లులను సర్కారు ప్రవేశపెట్టనుంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం జూన్‌లో వర్షాకాల సమావేశాలను నిర్వహించింది. అయితే ఆరు నెలల్లోగా మరోమారు శాసనసభను సమావేశపరచాల్సి ఉంటుంది. అందువల్ల డిసెంబరు మొదటి వారంలో సమావేశాలు నిర్వహించాలని జగన్ సర్కార్ సంకల్పించింది.

రాష్ట్రంలో  గతకొంత కాలంగా నెలకొన్న తీవ్ర ఇసుక కొరతయకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెక్ పెట్టింది. వరదల కారణంగా ఇంతకాలం ఇసుక తవ్వకాలు నిలిచిపోగా  ప్రస్తుతం భారీ ఎత్తును ఇసుక తవ్వకాలను చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో గతంతో పోలీస్తే ఇసుక సమస్య చాలావరకు తగ్గినట్లు ప్రభుత్వం వెల్లడించారు. 

Also Read:ఇసుక కొరతకు జగన్ ప్రభుత్వం చెక్...

రాష్ట్రంలోని అన్ని నదుల్లో  వరదనీటి ఉదృతి తగ్గుముకం పట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా ఇసుక సరఫరా పెరిగినట్లు ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ ఇసుక సరఫరా వారం రోజుల వ్యవధిలోనే దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 

ఇసుక సరఫరా  నవంబరు 1 న 31,576 టన్నుల సరఫరా వుండగా నవంబరు 7 నాటికి 86,482 టన్నులకు పెరింగింది. ఇక ఇవాళ అంటే నవంబరు 8నాటికి  అది 96 వేల టన్నులకు చేరుకుంది. మరో రెండు రోజుల వ్యవధిలోని ఈ సరఫరా లక్ష టన్నులను చేరుకోనుందని అధికారులు తెలిపారు. 

నదుల నుండి మొదటి ఆర్డ్‌ర్, రెండో ఆర్డర్, మూడో ఆర్డర్‌ కింద ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. వరుస స్ట్రీమ్స్‌లో 300 పైగా రీచ్‌లు గుర్తించినట్లు...నదుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న కొద్ది మరిన్ని ఎక్కువ రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. 

Also Read:భవన నిర్మాణ కార్మికులకు జనసేన అండ... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

ఇటీవలే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు  తీసుకోవాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ అంశం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో సీఎం కేవలం దీనిపై చర్చించేందుకే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీచేశారు.

ముఖ్యంగా ఇసుక ధరలకు కళ్లెం వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ ను కూడా సిద్ధంచేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.