అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి. వైయస్ఆరోగ్యశ్రీ పథకంపై జగన్ కు సెల్యూట్ చేస్తున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

నామినేటెడ్ పోస్టులు రెడ్లకు ఎక్కువ ఇచ్చినందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వానికి రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం అని పేరు పెట్టాలంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి.   

రాయలసీమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం జగన్ అద్భుతంగా మాట్లాడారంటూ కితాబిచ్చారు. జగన్ హయాంలో తాత రాజారెడ్డి పాలన కొనసాగుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. 

వంశీతో జగన్ స్కెచ్: చంద్రబాబు అలర్ట్, నిలువరించేనా...

ఇకపోతే నెల్లూరు జిల్లా మాఫియాకు అడ్డగా మారిందని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని హితవు పలికారు. 
మరోవైపు చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. 

తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదని మండిపడ్డారు. అది చంద్రబాబుకు చేతకాలేదని కానీ జగన్ కు చేతనైందంటూ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  

రోజా నెక్స్ట్ టార్గెట్ ఆ హీరోనే : లోకేష్ ను చూస్తే కాళ్లు వణుకుతున్నాయంటూ రోజా పంచ్ లు..