వంశీతో జగన్ స్కెచ్: చంద్రబాబు అలర్ట్, నిలువరించేనా....
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని సీఎం వైయస్ జగన్ తోపాటు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించారని ఆరోపిస్తోంది టీడీపీ.
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తించడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వల్లభనేనిని అలా గుర్తించడం తగదంటూ మండిపడుతున్నారు.
అసెంబ్లీలో వల్లభనేని వంశీమోహన్ మాట్లాడటాన్నే తట్టుకోలేకపోయిన టీడీపీ ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించడంతో మరింత రెచ్చిపోతున్నారు. తమ పార్టీకి రాజీనామా చేసిన వంశీ ఎమ్మెల్యేగా ఎలా కొనసాగుతారంటూ నిలదీస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం స్పీకర్ తమ్మినేని సీతారాంతో టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించడం సరికాదని రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేశారు.
వల్లభనేని వంశీమోహన్ ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించడం వైసీపీ వ్యూహంలో భాగమేనని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యులను వైసీపీలో చేర్చుకోకుండా అనుబంధంగా ఉంచుతూ టీడీపీని దెబ్బతీసే కుట్ర జరుపుతుందని టీడీపీ ఆరోపిస్తోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని సీఎం వైయస్ జగన్ తోపాటు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించారని ఆరోపిస్తోంది టీడీపీ.
పవన్ కు ఝలక్: జగన్ ను సమర్థించిన జనసేన ఎమ్మెల్యే రాపాక...
భవిష్యత్ లో మరింతమంది టీడీపీ ఎమ్మెల్యేలు తమను కూడా ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కోరుతూ వైసీపీకి అనుబంధంగా వెళ్తే పరిస్థితి ఏంటా అన్న సందిగ్ధంలో పడింది తెలుగుదేశం పార్టీ.
భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేయిదాటకుండా ఉండటంతోపాటు చంద్రబాబు ప్రతిపక్ష హోదాను కాపాడుకునేందుకు అప్రమత్తమైందని తెలుస్తోంది. వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించకుండా ఉంటే మిగిలిన ఎమ్మెల్యేలు టీడీపీ వీడరని నమ్ముతుంది పార్టీ నాయకత్వం.
జగన్! ముందుంది ముసళ్లపండగ, మీ కథ చూస్తాం: చంద్రబాబు ఫైర్..
ఇకపోతే తెలుగుదేశం పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతానికి వంశీ బాటలో పయనించేందుకు ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగేందుకు రెడీగా ఉన్నారంటూ ప్రచారం కూడా జరుగుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ముందుగా మేల్కొన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కట్టడి చేసే విషయంలో కాస్త గట్టిగా ఉండాలని అందులో భాగంగా వంశీపై వేటు వేయిస్తే మిగిలిన వారు ఎటూ వెళ్లరని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే శాసనసభలో మంగళవారం తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి, సీటు కేటాయించాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అందుకు స్పీకర్ తమ్మినేని సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జగన్ సూపర్ ప్లాన్, వంశీకి స్పెషల్ బెర్త్: క్యూ లైన్లో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు...