అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కే రోజా హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని నిలదీశారు రోజా.

బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారంటూ రోజా ఆరోపించారు. చంద్రబాబు మైక్ ఇవ్వడం లేదని విమర్శించారు రోజా. నటుడు అయిన బాలకృష్ణకు అవకాశం ఇవ్వకపోవడం కళాకారులను అవమానించడమేనంటూ ఆరోపించారు. 

చంద్రబాబు నాయుడు కళాకారులను అగౌరవపరుస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. కళాకారులపై చంద్రబాబు నాయుడుకు గౌరవం ఉంటే బాలకృష్ణకు మైక్ ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడించాలని సూచించారు. 

తాను కూడా సినీ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చానని తనను తమ పార్టీ అధినేత సీఎం వైయస్ జగన్ ప్రోత్సహిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారని కానీ చంద్రబాబు ఇవ్వడం లేదన్నారు. 

వంశీతో జగన్ స్కెచ్: చంద్రబాబు అలర్ట్, నిలువరించేనా.......

జగన్ కు కళాకారులు అంటే ఎంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చారు రోజా. ఎస్వీబీసీ చైర్మన్ గా సినీనటుడు పృథ్వీరాజ్  ను నియమించారని అలాగే టీటీడీ మెంబర్ గా సినీ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డిని నియమించారని గుర్తు చేశారు రోజా. 

మరోవైపు నారా లోకేష్ పైనా సెటైర్లు వేశారు రోజా. బుధవారం ఉదయమే చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ తో ప్రెస్మీట్ పెట్టించారని ఆరోపించారు. లోకేష్ ను చూస్తుంటే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటూ ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

ఔను లోకేష్ ను చూస్తే నాకాళ్లు కూడా వణుకుతున్నాయి అంటూ రోజా సెటైర్లు వేశారు. మంగళగిరి అని పలకడానికి లోకేష్ ట్యూషన్ పెట్టించుకున్నారంటూ విమర్శించారు రోజా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నారా లోకేష్ ను టార్గెట్ చేశారు ఎమ్మెల్యే రోజా. 

అయితే తాజాగా సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే రోజా నెక్స్ట్ టార్గెట్ బాలయ్యేనని అర్థమవుతుంది. ఇప్పటికే టంగ్ స్లిప్ అయిన లోకేష్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్న రోజా బాలకృష్ణ కూడా టంగ్ స్లిప్ అయితే బాలయ్యపై కూడా సెటైర్లు వేసేందుకు రెడీ అవుతున్నారు రోజా.    

పవన్ కు ఝలక్: జగన్ ను సమర్థించిన జనసేన ఎమ్మెల్యే రాపాక...