శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లా తొగరం గ్రామ సర్పంచ్ గా విజయం సాధించారు. ఆమె 550 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వార్డులన్నీ ఏకగ్రీవం కాగా, సర్పంచ్ పదవికి మాత్రం పోటీ జరిగింది. తమ్మినేని సీతారాం సతీమణి వాణి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. తొగరం తమ్మినేని సీతారాం స్వగ్రామం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం పోలింగ్ జరిగింది. పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఎక్కువ గ్రామ పంచాయతీలను అధికార వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. 

మూడో విడత 2,639 సర్పంచ్ స్థానాలకు, 19,553 వార్దులకు పోలింగ్ జరిగింది.