సంచలన నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..
AP Assembly: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు
AP Assembly: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్టీ మారిన ఎనిమిది మంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సదరు ఎమ్మెల్యేల స్పందన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల జాబితా ఇదే..
అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. వైసీపీ పార్టీకి చెందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలపై అనర్హత వేటు పడింది. వీరితోపాటు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు కూడా జాబితాలో ఉన్నారు. ఈ మేరకు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.