బాబు వస్తున్నారు నా సీటు మార్చండి, సభలో వైసీపీ ఎమ్మెల్యే : జగన్ నవ్వులు
ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనపక్కనే వచ్చి నిలబడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత నా దగ్గరకు వచ్చి నిలబడితే ఏమి మాట్లాడగలను అంటూ చెప్పుకొచ్చారు. తన సీటు మార్చాలని రిక్వస్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ శీతాకాల సమావేశాల్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.
ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనపక్కనే వచ్చి నిలబడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత నా దగ్గరకు వచ్చి నిలబడితే ఏమి మాట్లాడగలను అంటూ చెప్పుకొచ్చారు. తన సీటు మార్చాలని రిక్వస్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి.
పీపీఏలపై ఏపీ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరుగుతుంది. విద్యుత్ రంగంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం చెప్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు.
దాంతో రామనారాయణరెడ్డి మైక్ తీసుకుని ప్రతిపక్షంపైనా చంద్రబాబు పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. అరాచక శక్తులంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించడం సమంజసం కాదని అన్నారు.
అరాచక శక్తులంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం గౌరవప్రదం కాదని, ఆ పదాన్ని చంద్రబాబు ఉపసంహరించుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని హితవు పలికారు. ఒకవేళ చంద్రబాబు ఉపసంహరించుకోకపోతే ఈ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను ఆనం రామనారాయణరెడ్డి కోరారు.
అలాగే తన సీటు కూడా మార్చాలని, ప్రతిపక్ష నేతే తన పక్కన నిలబడితే తానెలా మాట్లాడగలనని రామనారాయణ రెడ్డి అనడంతో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వారు.
అధికార పార్టీ సభ్యులతోపాటు ప్రతిపక్ష సభ్యులు సైతం తెగ నవ్వేశారు. అయితే చంద్రబాబు నాయుడు వాడిన అరాచక శక్తుల పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించడంతో సమస్య సద్దుమణిగింది.
ఆయనకి ముగ్గురు పెళ్లాలు, నాకు ఒక్కతే భార్య: పవన్ పై జగన్ సెటైర్