లోకేష్ పప్పులో ఉల్లి లేదనే చంద్రబాబు బాధ: బాలకృష్ణపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ తినే పప్పులో ఉల్లిపాయ లేదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు బెంగ పెట్టుకున్నారంటూ సెటైర్లు వేశారు రోజా.
అమరావతి: మాజీమంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాల నేపథ్యంలో తమ ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.
మహిళల భద్రతపై అసెంబ్లీలో చర్చించేందుకు తమ ప్రభుత్వం పట్టుబడుతుంటే టీడీపీ నాయకులు తమ రహస్యాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న ఆందోళనతో ఉలిక్కిపడుతున్నారంటూ రోజా విరుచుకుపడ్డారు.
మాజీమంత్రి నారా లోకేష్ ఫోటోలు ఎక్కడ బయటకు వస్తాయో, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆడవాళ్లను చులకన చేసే విధంగా చేసిన వ్యాఖ్యలు ఎక్కడ బయటకు వస్తాయో లేకపోతే కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి చర్చిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళనతో టీడీపీ నేతలు భయపడుతున్నారంటూ విరుచుకుపడ్డారు.
అమ్మాయి కనబడితే కడుపు చేయాలి లేకపోతే కమిట్ అయిపోవాలన్న బాలకృష్ణ వ్యాఖ్యలు ఎక్కడ చర్చకు వస్తాయో అన్న ఆందోళనలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఉన్నారంటూ విరుచుకు పడ్డారు.
మహిళా హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మహిళల మాన ప్రాణాలపై మాట్లాడుతుంటే టీడీపీ నేతలు ఉల్లిధరలపై పట్టుబడటం దారుణమన్నారు. ఉల్లిపాయలు లేకపోతే ప్రాణం పోతుంది అన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ రోజా విరుచుకుపడ్డారు.
మహిళల మాన, ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా టీడీపీ ఎమ్మెల్యేలకు పట్టడం లేదంటే మహిళలపట్ల వారికున్న గౌరవం ఏంటో తెలుస్తుందన్నారు. మహిళలను చులకన చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టే టీడీపీ 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసి మూలన కూర్చోబెట్టారంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రోజా.
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ తినే పప్పులో ఉల్లిపాయ లేదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు బెంగ పెట్టుకున్నారంటూ సెటైర్లు వేశారు రోజా. ఈ రాష్ట్రంలో ఆడపిల్ల మాన ప్రాణాలకు సంబంధించి ఎలాంటి బాధ చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ బాధ ఏంటో తెలియదంటూ విరుచుకుపడ్డారు రోజా.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఆడపిల్లల భద్రత కోసం చర్చ జరుగుతుంటే దానికి అడ్డుపడకూడదన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకు రాకపోవడం బాధాకరమన్నారు.
కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్తవద్దంటాదా అంటూ ఆడపిల్లల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ఈరోజైనా ఆడపిల్లల భద్రతపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రోజా విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులు అంతా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. దిశ ఘటన తర్వాత ప్రతీ మహిళ ఆందోళనలో ఉందని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు రోజా.
అసెంబ్లీలో ఉల్లిపై జగన్ : రైతుబజార్ లో కిలో రూ.25 కానీ చంద్రబాబు హెరిటేజ్ లో కిలో ఉల్లి రూ.200