Asianet News TeluguAsianet News Telugu

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సభ ముందు కీలక బిల్లులు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో పలువురి సంతాప తీర్మానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ap assembly session begins tomorrow ksp
Author
Amaravathi, First Published Nov 29, 2020, 10:21 PM IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో పలువురి సంతాప తీర్మానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనుంది. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలో బీఏసీ నిర్ణయించనుంది.

తొలిరోజు వ్యవసాయ రంగంపై చర్చించనున్నారు. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. ఈ సెషన్‌లో 19 బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఎకానిమల్‌ ఫీడ్, ఫిష్‌ ఫీడ్ యాక్ట్, ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్, ఏపీ ఫిషరీష్ వర్సిటి బిల్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసైన్డ్‌ భూముల చట్ట సవరణ, అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్‌ యాక్ట్, ఏపీ వ్యాట్ బిల్, ఏపీ ట్యాక్స్ ఆన్‌ ప్రొఫెషన్స్ ట్రేడ్స్ సవరణ బిల్, ఏపీ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ఉమెన్, మోటార్ వెహికల్ చట్టం, ఆన్‌లైన్ గేమింగ్ నిషేధితచట్టం, స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఏపీ ఎఫ్‌ఆర్‌బిఎం సవరణ బిల్లు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు, మున్సిపల్ లా సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios