వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 లేదా 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం వున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 లేదా 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం వున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారం పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ఆలోచిస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో చర్చలు వాడివేడిగా జరిగే అవకాశం వుంది. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పంట నష్టం, సహాయక చర్యలపై ప్రభుత్వాన్ని విపక్షం ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
