అమరావతి: మంత్రి కొడాలి నానిని ఎర్రగడ్డ పిచ్చాస్పత్రిలో చేర్చాలంటూ మాజీమంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు ఘటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. 

తనను పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న అచ్చెన్నాయుడును పశువుల ఆస్పత్రిలో చేర్చాలంటూ కౌంటర్ ఇచ్చారు. పశువుల ఆస్పత్రిలో చేర్పిస్తే ఆయన ఆరోగ్యం బాగుంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి కొడాలి నాని. 

ఇకపోతే కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మానసిక వైకల్య కేంద్రాన్ని ఇచ్చిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పారని అయితే ఆ మానసిక వైకల్యకేంద్రానికి చంద్రబాబు నాయుడు పేరుపెట్టాలని సూచించారు. 

చంద్రబాబు గిల్లుడుకు ఆ ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే రాజా...

అమరావతిలో ఆ మానసిక వైకల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి చంద్రబాబు నాయుడు పేరు పెట్టడంతోపాటు ఆయనను మెుదటి పేషెంట్ గా చేర్చాలని సీఎం వైయస్ జగన్ ను కోరారు. అలాగే చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలను సైతం ఆస్పత్రిలో చేర్చాలన్నారు. 

కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పిచ్చెక్కి శాసన సభలో తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చెక్కి మార్షల్స్ ను కొట్టడం, తిట్టడం సభలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ కొడాలి నాని దుమ్మెత్తిపోశారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను విన్న సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఊగిపోయారు. 

సభలో వైసీపీకి టీడీపీ ట్విస్ట్: జగన్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు...

ఇకపోతే అంతకుముందు మంత్రి కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. సభలో కొడాలి నాని వాడుతున్న భాష, వ్యవవహరిస్తున్న తీరును తాను చూడలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. నానిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు వింటుంటే విసుగు వస్తుందన్నారు. ఆ మాటలు భరించలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. సభలో ఆయన మాట్లాడుతున్న తీరు సక్రమంగా లేదంటూ అచ్చెన్నాయుడు విమర్శించిన సంగతి తెలిసిందే. 

కొడాలి నానికి మెంటల్, నీ సంగతి తొందర్లో తేలుతోంది: అచ్చెన్న..