అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా. అసత్యాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

గురువారం అసెంబ్లీగేటు వద్ద చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు బూతులు తిట్టారన్న విషయం అందరికీ వినిపిస్తున్నా ఆయనకు మాత్రమే వినిపించకపోవడం చూస్తుంటే ఏదో లోపం ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 

చంద్రబాబు నాయుడుకు బ్లాక్ కమాండోస్ తో ప్రత్యేక రక్షణ ఉంటుందని గుర్తు చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చంద్రబాబుకు రక్షణ కల్పిస్తున్నామని అయితే ఆయన దగ్గరకు బ్లాక్ కమాండోస్ ఎవర్నీ రానియ్యరని చెప్పుకొచ్చారు. 

అసెంబ్లీలోకి ఆయన రావాల్సిన గేటు వేరేది అయితే పబ్లిసిటీ కోసం వేరేగేటు నుంచి రావడం ఏంటని నిలదీశారు. ఇదే పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో ఒక గేటు నుంచి రావాల్సింది పోయి మరో గేటు నుంచి వచ్చి 28 మంది ప్రాణాలు బలితీసుకున్నారంటూ ఆరోపించారు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయని ఆరోపించారు. ఈనాడు ఎవరి ప్రాణాలు బలితీసుకోవాలని వేరే గేటు వెంట వచ్చారో చెప్పాలని నిలదీశారు. 

బాత్ రూమ్ దగ్గర దాక్కునేవాళ్లం,.. వాళ్ళ అంతలా వేధించారు: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన...
 
 చంద్రబాబు నాయుడు తనకు పౌరుషం లేదని చెప్పడం వాస్తవమేనన్నారు. చంద్రబాబు నాయుడుకు చీము, నెత్తురు, సిగ్గు శరం, బుద్ది, జ్ఞానం ఇవేమీ లేవని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. 

దమ్ము, పౌరుషం, ఖలేజా ఉంది కాబట్టే ప్రజలు వైయస్ జగన్ కు పట్టం కట్టారని గుర్తు చేశారు. జగన్ కు పౌరుషం ఉంది కాబట్టే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్న నమ్మకంతో అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించారని చెప్పుకొచ్చారు జక్కంపూడి రాజా. 

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై సెటైర్లు వేశారు జక్కంపూడి రాజా. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవలే వెన్నునొప్పికి సంబంధించి శస్త్రచికిత్స చేయించుకున్నారని గుర్తు చేశారు. 

సీఎం స్థానాన్ని అవమానించింది జగనే: కొడాలి నాని, రోజాలపై చంద్రబాబు ఆగ్రహం..

అయితే అది వెన్నునొప్పి గురించి కాదని తన అభిప్రాయమన్నారు. నిత్యం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మాట్లాడు అంటూ గిల్లుతూ ఉంటారని అందువల్లే ఆయన ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందంటూ సెటైర్లు వేశారు జక్కంపూడి రాజా. 

తెలుగుదేశం పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబుపై ఉన్నంత కోపం ఇంకెవ్వరికి ఉండదన్నారు. మాట్లాడండి, గెంతులేయండి, కేకలు వేయండి అంటూ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గిల్లుతూ ఉంటారని అందువల్లే ఆయనకు చంద్రబాబు అంటే విపరీతమైన కోపం అంటూ చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు నాయుడు చిరకాలం తానే ముఖ్యమంత్రి అని భ్రమలో బతుకుతున్నారంటూ విరుచుకుపడ్డారు. జీవితాంతం తానే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అనే భ్రమలో చంద్రబాబు ఆయన తనయుడు ఉన్నారంటూ ధ్వజమెత్తారు. 

చీఫ్ మార్షల్స్ ను రాస్కెల్, బాస్టెడ్ అని తిట్టడం ఏంటని నిలదీశారు. ఇలాంటి బూతులతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని నిలదీశారు కాపుకార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా. 

 చంద్రబాబు అండ్ టీంపై చర్యలు తీసుకోండి: మంత్రి బుగ్గన తీర్మానం...