అమరావతి: ఏపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు. డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి కొడాలి నానిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు వినలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. సభలో ఆయన మాట్లాడుతున్న తీరు సక్రమంగా లేదంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇకపోతే తాను ఏనాడూ మహిళలపట్ల తప్పుడుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. 

తాను గట్టిగా మాట్లాడతానే తప్ప మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. తాను మహిళలను వేధించినట్లు తనపై కేసులు ఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు అచ్చెన్నాయుడు. 

బాత్ రూమ్ దగ్గర దాక్కునేవాళ్లం,.. వాళ్ళ అంతలా వేధించారు: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన...

ఇకపోతే అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అచ్చెన్నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావులు మహిళలను వేధించారన్న ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏడీఆర్ నివేదికలో ఈ అంశంపై ప్రస్తావించారని గుర్తు చేశారు. 

పాముల పుష్పశ్రీవాణి తప్పుమాట్లాడారంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాముల పుష్పశ్రీవాణి అసలు ఎస్టీయే కాదని చెప్పుకొచ్చారు. ఎస్టీ సర్టిఫికెట్ మీద ఎమ్మెల్యే అయి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారంటూ ధ్వజమెత్తారు. తాను ఆవిషయాన్ని ప్రస్తావించలేదని అలాంటి వ్యక్తులు కూడా తనను విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం  చేశారు.  

చంద్రబాబు గిల్లుడుకు ఆ ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే రాజా..

ఇకపోతే పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు సైతం అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కళ్యాణి అనే మహిళ మాజీమంత్రి అచ్చెన్నాయుడు తనను తన్నారని, అలాగే టెక్కలి సీఐ, ఎస్ ఐ లైంగిక వేధిస్తున్నారంటూ ఆరోపించిందని గుర్తు చేశారు. 

ఇదే అంశాన్ని చంద్రబాబుకు ఫిర్యాదు చేద్దామని ఆ మహిళ ప్రయత్నిస్తే చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో సచివాలయం గేటు దగ్గర బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారని మరి ఆమె విషయంలో ఏం న్యాయం చెప్పారో చెప్పాలని నిలదీశారు. 

ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఎమ్మెల్యే అయ్యారని వెనుక ముందూ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కొద్ది రోజుల్లో నీసంగతి తెలుస్తుందంటూ ఎమ్మెల్యే అప్పలరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. 

అసెంబ్లీలో ప్రతీ ఒక్కరూ తనను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపడం తాను చేసిన తప్పా అంటూ నిలదీశారు. ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై మాట్లాడితే దాడికి దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. 

ఏపీ అసెంబ్లీలో దిశ చట్టం, మృగాలకు ఉరే సరైన శిక్ష:హోంశాఖ మంత్రి సుచరిత...