అమరావతి: సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై ఏపీ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది.శాసనమండలిలో ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చట్టసభలు ప్రోరోగ్  కాకుండా ఆర్డినెన్స్ తీసుకురావడం సాంకేతికంగా సాధ్యం కాదు. 

దీంతో శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గురువారం నాడు రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు నోటిపికేషన్ కూడ జారీ అయింది. దరిమిలా ఈ రెండింటిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు  ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్టైంది.

Also read:చర్యలు తప్పవు: ఏపీ శాసమండలి సెక్రటరీకి ఛైర్మెన్ షరీఫ్ వార్నింగ్

ఈ రెండు బిల్లులు శాసనమండలి ముందు ఉన్నాయి.ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మెన్ సూచించారు. అయితే ఈ బిల్లులు ఆమోదం లభించినట్టేనని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు సెలెక్ట్ కమిటీని రెండు రోజుల్లో నియమించినట్టుగా తనకు నివేదిక పంపాలని సెక్రటరీని ఆదేశిస్తూ శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్ గురువారం నాడు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ రెండు బిల్లులను ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా అమలు చేయాలని సర్కార్ భావించింది. అయితే దీనికి అడ్డుగా ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించింది.ఈ క్రమంలోనే శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నోటిపికేషన్ జారీ అయింది.

చట్టసభల ముందు బిల్లులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆ సభలో ప్రోరోగ్ చేయకపోతే ఆర్డినెన్స్ తీసుకురావడం సాంకేతికంగా సాధ్యం కాదు. ఈ కారణంగానే ఏపీ శాసనసభను, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

 యూపీఏ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టానికి సవరణల విషయంలో కూడ ఇదే రకంగా  ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ 2013 భూసేకరణ చట్టం విషయంలో  ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు,

మరో వైపు ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఉన్న సమయంలోనే  రపార్లమెంట్ ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ ట్రిపుల్ తలాక్ పై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఇదే తరహాలో చోటు చేసుకొన్న ఉదంతాలను వైసీపీ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.ఈ రెండు బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకు రానుంది  ప్రభుత్వం