ఆ ఎమ్మెల్యే నా నియోజకవర్గాన్ని పూర్తిగా నాకేశాడు: రాపాక సంచలన వ్యాఖ్యలు
ఇకపోతే తన నియోజకవర్గం విషయానికి వస్తే ఇప్పటి వరకు రాజోలు నియోజకవర్గానికి అవినీతి మచ్చ ఏర్పడలేదని చెప్పుకొచ్చారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నియోజకవర్గాన్ని మెుత్తం అవినీతిమయం చేశారని ఆరోపించారు.
అమరావతి: జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టడంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇకపోతే తన నియోజకవర్గం విషయానికి వస్తే ఇప్పటి వరకు రాజోలు నియోజకవర్గానికి అవినీతి మచ్చ ఏర్పడలేదని చెప్పుకొచ్చారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నియోజకవర్గాన్ని మెుత్తం అవినీతిమయం చేశారని ఆరోపించారు.
దిశ చట్టం నాతోనే ప్రారంభించండి, తట్టుకోలేను: సభలో మహిళా ఎమ్మెల్యే ఆవేదన...
గొల్లపల్లి సూర్యారావు స్థానికుడు కాదని స్థానికేతరుడు అంటూ చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో తన నియోజకవర్గాన్ని సాంతం నాకేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గాన్ని సర్వం దోచేసిన ఆనాటి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అవినీతి సొమ్ముతో రూ.15కోట్లు విలువైన కాలేజీని నిర్మించారని అలాగే అనేక ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు.
తన నియోజకవర్గంలో జాతీయ ఉపాధిహామీ పథకం అమలులో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. అంతటి అవినీతిపరుడుకు టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
ఆ ఎమ్మెల్యేలేమైనా పనికిమాలినోళ్లా..? పీకపోయినా సరే..: స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు...
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు చేస్తున్న రాద్ధాంతం వల్ల తమలాంటి ఎమ్మెల్యేలు ప్రశ్నించే అవకాశం కోల్పోతున్నట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఆఖరిన అవకాశం ఇవ్వాలని, వారు ఇకపై అల్లరి చేయకుండా చూడాలంటూ కోరారు రాపాక వరప్రసాదరావు.
ఇకపోతే తన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో చివరి నియోజకవర్గం రాజోలు నియోజకవర్గమని దాన్ని ఆదుకోవాలని కోరారు.
పల్లపు ప్రాంతం కావడంతోపాటు కాల్వల పక్కన రోడ్లు ఉండటంతో రోడ్లు కృంగిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్, మంత్రులు కరుణతో తన నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.
నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, మరి మీరు: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్..