దిశ చట్టం నాతోనే ప్రారంభించండి, తట్టుకోలేను: సభలో మహిళా ఎమ్మెల్యే ఆవేదన
దిశ యాక్ట్ అనేది అసెంబ్లీలో తన నుంచే ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కోరారు. ఒక మహిళా ఎమ్మెల్యేనైన తననే ఇంతలా వేధిస్తే ఒక సాధారణ మహిళ పరిస్థితి ఏంటని అసెంబ్లీలో వాపోయారు.
అమరావతి: వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ దిశ చట్టం తనతోనే మెుదలుపెట్టాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. రాష్ట్రంలో మద్యపాన నిషేధంపై తాను మాట్లాడిన మాటలను ట్రోల్ చేస్తూ కొందరు తనను వేధిస్తున్నారని ఆరోపించారు.
మద్యపాన పాలసీపై అసెంబ్లీలో మాట్లాడటంతో తన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు వేధింపులకు గురి చేస్తున్నారని సభలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేగా తనను ఇంతలా వేధిస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలపై ట్రోల్ అవుతున్నతీరును చూసి తమ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆమె వాపోయారు. అయితే ట్రోల్ చేస్తూ వేధింపులకు పాల్పడటాన్ని తాను అంతగా పట్టించుకోబోనని తెలిపారు.
నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న జగన్: అచ్చెన్నాయుడు ఫైర్...
తాను ఒక లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఇలాంటి ప్రచారాలను తాను పట్టించుకోబోనని తెలిపారు. అయితే మహిళల పట్ల ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా తాను సహించబోనని సీఎం జగన్ హామీ ఇచ్చారని దాన్ని నెరవేర్చాలని కోరారు.
దిశ యాక్ట్ అనేది అసెంబ్లీలో తన నుంచే ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కోరారు. ఒక మహిళా ఎమ్మెల్యేనైన తననే ఇంతలా వేధిస్తే ఒక సాధారణ మహిళ పరిస్థితి ఏంటని అసెంబ్లీలో వాపోయారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ వేధింపులకు పాల్పడిన వారి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ను కోరారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ.
ఆ నాయుడు మీ చుట్టం కాదా, అన్నీ బయటపెడతాం: చంద్రబాబుపై జగన్..