అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో చోటు చేసుకున్న పరిణామాలపై విచారం వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం బాధాకరంగా ఉందన్నారు. 

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. ప్రతీ చిన్న సమస్యపై కూడా వచ్చి పోడియంను చుట్టిముట్టడం, నిరసనలు తెలియజేయడం చూస్తుంటే బాధేస్తుందన్నారు. 

తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు వ్యవహరిస్తున్న తీరుతో సస్పెండ్ కు గురయ్యారని చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సింది పోయి నిత్యం ఇదే పనిగా పెట్టుకుని సభలో అలజడి సృష్టించేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పనికిమాలిన కబుర్లు కాకుండా పనికొచ్చేవి చెప్పు: చంద్రబాబుపై కొడాలి నాని...

సభ్యులను సస్పెండ్ చేయాలన్న ఆలోచన ఏ స్పీకర్ కు రాదని అయితే తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు.  సభ్యులను సస్పెండ్ చేయడం తనకు గానీ, సభా నాయకుడికి గానీ ఉండబోదన్నారు. సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరును సభ్యులంతా తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే అమరావతి రాజధానిని చర్చకు తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ సభ్యులేనని స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. అమరావతిపై చర్చకు సంపూర్ణంగా అవకాశం ఇచ్చినట్లు సీతారాం గుర్తు చేశారు. రాజధానిపై తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత మంత్రితోపాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. 

రాజధాని అంశంపై సభలో చర్చ జరుగుతున్న తరుణంలో కొన్నివాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. ఇరువురు సభలో రాజధానిపై చర్చిస్తున్న తరుణంలో ఇలా సభ్యులు సభ జరగకుండా అడ్డుతగలడం విచారకరమన్నారు. చర్చలో వాస్తవాలను బయటకు తీసుకువచ్చేందుకు జరుగుతున్న తరుణంలో సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. 

అసెంబ్లీలో అమరావతి రగడ: రాజధానిపై చంద్రబాబు సవాల్, వైసీపీ ప్రతిసవాల్..

ఇప్పటికే రాజధానిపై ఏపీ ప్రజలు చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధం కూడా నెలకొందన్నారు. అలాంటి సందేహాలను నివృత్తి చేసేలా, ప్రజల అనుమానాలను పటాపంచలు చేసేందుకు ప్రభుత్వం వివరణ ఇస్తున్న తరుణంలో సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. 

సస్పెన్షన్ వేటుకు గురైన సభ్యుల పేర్లు తాను చదివేటప్పుడు ఇబ్బందులకు గురైనట్లు స్పీకర్ చెప్పుకొచ్చారు. సస్పెన్షన్ కు గురైన సభ్యుల్లో అంతా తనుకు తెలుసునని చెప్పుకొచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో, బాధాతప్త హృదయంతో సస్పెండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. 

ఒక అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఇలా సభ్యులు అడ్డుపడటం, ప్రజల అనుమానాలు నివృత్తమవుతున్న తరుణంలో సభ్యులు వ్యవహరించిన తీరు కలచివేసిందన్నారు. అలాంటి తరుణంలో తాను వారిపై సస్పెండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. 

ఏ స్పీకర్ కు సభ్యుడిని సస్పెండ్ చేయాలని ఉండదని, అలా అనుకోరని అయితే అందుకు తాను భిన్నంగా వ్యవహరించానని అందువల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం.   

Ap assembly: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, అచ్చెన్నతో పాటు.....