అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలకు చంద్రబాబు నాయుడు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని విమర్శలకు తానేమీ బాధపడటం లేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మహానగరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ అనే రెండు సిటీలు ఉంటే బిల్ క్లింటన్ తీసుకువచ్చి సైబరాబాద్ నగరంగా నామకరణం చేసింది తానేనని గుర్తు చేశారు. 

తాను చరిత్రను వక్రీకరించడం లేదని గొప్పలు అసలే చెప్పడం లేదన్నారు. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ మహానగరం వల్ల ఆరోజు తెలంగాణకు ఎలాంటి ఆదాయం వస్తుంది అన్న విషయాన్ని ఈ సభ కూడా ఆలోచిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇకపోతే నవ్యాంధ్ర రాజధానిపై శివరామకృష్ణ  కమిటీ సైతం కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు. శివరామకృష్ణ కమిటీ కూడా విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్యనే రాజధాని నిర్మాణం జరగాలని సూచించిందని చెప్పుకొచ్చారు. 

పనికిమాలిన కబుర్లు కాకుండా పనికొచ్చేవి చెప్పు: చంద్రబాబుపై కొడాలి నాని..

శివరామకృష్ణ కమిటీ చేపట్టిన సర్వేలో విజయవాడ-గుంటూరు ప్రాంతాల మధ్యే రాజధాని ఏర్పాటు చేయాలని అనేకమంది తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు కమిటీ నివేదికలో ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు.  

ఆనాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశించినట్లుగానే 13 జిల్లాలకు మధ్యన, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తని ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని ఆయన సూచిస్తే ఆయన సూచనలను కూడా పరిగణలోకి తీసుకునే అమరావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. 

7 జిల్లాలు దక్షిణభాగంలో ఉంటే 6 జిల్లాలు ఉత్తర భాగంలో ఉండేలా విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని నెలకొల్పినట్లు తెలిపారు. ఈ రెండు ప్రాంతాల మధ్య అయితే పాపులేషన్ కూడా పెరుగుతారని ఇతరులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని భావించి రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. 

ap assembly: ఎన్ని ఏళ్లైనా హైదరాబాద్ అభివృద్థిలో నా ప్రాత ఉంటుంది:చంద్రబాబు..

జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం 33 శాతానికి గణనీయంగా తగ్గిపోయిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఒక కారణం అయితే అంతర్జాతీయ స్థాయిలో తీసుకువచ్చిన తప్పుడు ప్రచారంతోపాటు తప్పుడు నిర్ణయాలతో ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. 

ఆరు నెలల్లో రాజధాని ప్రాంతంలో విద్య కోసం 1శాతం, హెల్త్ కోసం 2 శాతం నిధులు కేటాయించారని అందువల్ల ఆదాయం తగ్గిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజారాజధాని అమరావతిలో సంపద సృష్టించవచ్చునన్నారు. 

సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ద్వారా సంపద సృష్టించుకుందామనుకున్నారు. హైదరాబాద్ లో కూడా ఇలాగే వ్యవహరించామని అందువల్లే అక్కడ అభివృద్ధి చెందిందని తెలిపారు. కానీ అమరావతిలో అలా జరగలేదన్నారు. 

రాజధాని నిర్మాణాలు చేపడితే అనేక రూపాల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. రైతుల నుంచి 33వేల ఎకరాలు ల్యాండ్ ఫూలింగ్ తీసుకున్నామని వారికి అందులో కొంత లేండ్ కూడా తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. 

రైతులకు ల్యాండ్ ఇచ్చిన తర్వాత, మౌళిక సదుపాయలు సమకూర్చుకున్న తర్వాత  ఇంకా 10వేల ఎకరాలు మిగిలే ఉంటుందని అదే సంపద సృష్టిస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. భావితరాల భవిష్యత్ కోసం తాను అమరావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. 

కలకత్తాకు 76 శాతం ఆదాయం వెస్ట్ బెంగాల్ నుంచే వస్తుందని అలాగే తెలంగాణకు 60శాతం, మహారాష్ట్రకు ముంబై, ఒడిషాకు భువనేశ్వర్ నుంచి ఆదాయం వస్తుందని తెలిపారు చంద్రబాబు నాయుడు. అలాంటి రాజధానిని నిర్లక్ష్యం చేశారంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ap assembly: ఎన్ని ఏళ్లైనా హైదరాబాద్ అభివృద్థిలో నా ప్రాత ఉంటుంది:చంద్రబాబు..