ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో ఏపీ జేఏసీ అమరావతి  సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఎన్నికల ఉద్యోగులకు కరోనా రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరామని ఏపీ జేఏసీ అమరావతి తెలిపింది. టీకా ఇచ్చే వరకు 2,3 విడతల ఎన్నికల రీ షెడ్యూల్ కోరామని ఏపీ జేఏసీ వెల్లడించింది.

Also Read:వైసీపీకి ఊరట, చంద్రబాబుకి షాక్: టీడీపీకి నిమ్మగడ్డ నోటీసులు

ఎన్నికల రీ షెడ్యూల్ కుదరదని ఎస్ఈసీ చెప్పారని పేర్కొంది. ప్రభుత్వం - ఎస్ఈసీ వ్యవహారంలో ఇబ్బందులు పడుతున్నామని ఏపీ జేఏసీ వాపోయింది.

ఈ పరిస్ధితుల్లో ఉద్యోగులు ఒత్తిడితో ఏమైనా పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకోవద్దని కోరామని.. పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పరిమితం చేయాలని కోరామని ఏపీ జేఏసీ వెల్లడించింది.