ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న మూడు రాజధానుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న మూడు రాజధానుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.
ఈ కేసుపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. కాగా ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం జస్టిస్ నారీమన్ బెంచ్‌కు మూడు రాజధానుల కేసును బదిలీ చేశారు. అయితే ఈ కేసులో రైతుల తరుపన నారిమన్ తండ్రి పాలి నారిమన్ వాదిస్తుండటంతో ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు.
అలాగే ఈ కేసుకు సంబంధించిన విచారణను వేరే బెంచ్‌కు మార్చాలని జస్టిస్ నారిమన్ ఆదేశించారు. దీంతో ఈ కేసు వేరే బెంచ్‌కు బదిలీకానుంది. ఈ నేపథ్యంలో విచారణను మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
కాగా పాలనా వికేంద్రీకరణ, రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
