వేదికమీద నుండి వెంకయ్య మాట్లాడటానికి లేవగానే వెంకయ్య, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు మొదలయ్యాయి. ‘లీవ్ టిడిపి-సేవ్ బిజేపి‘ అని రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు మొదలుపెట్టారు. వెంకయ్య వద్దని వారించేకొద్దీ రెచ్చిపోయి నినాదాలు మొదలుపెట్టారు. ఇదంతా అమిత్ షా దృష్టిలో పడింది. దాంతో నేతలే కాదు శ్రేణులు కూడా టిడిపికి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం అమిత్ షా బుర్రలోకి బాగా ఎక్కినట్లే ఉంది.
భారతీయ జనతా పార్టీలోని చంద్రబాబునాయుడు వ్యతిరేక వర్గం సక్సెస్ అయినట్లే కనబడుతోంది. భాజపా-టిడిపి పొత్తును వెంటనే తెంచుకోవాలని చంద్రబాబు వ్యతిరేక వర్గం ఎప్పటి నుండో జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నది. అయితే, చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న వెంకయ్యనాయుడు వల్ల సాధ్యం కావటం లేదు. అయితే, కాలం ఎల్లకాలం ఒకలాగుండదు కదా? వివిధ కారణాల వల్ల ఢిల్లీలో వెంకయ్య ప్రాభవం తగ్గుతోంది. అదే అదునుగా వ్యతిరేక వర్గం రెచ్చిపోతోంది.
గడచిన ఏడాదిగా చంద్రబాబుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటమే ఇందుకు నిదర్శనం. ఇటువంటి పరిస్ధితుల్లోనే చంద్రబాబు అమెరికా పర్యటన, అదే సమయంలో జగన్ –మోడి భేటీ అందరికీ తెలిసిందే. వీరి భేటీ విషయంలో కొందరు మంత్రులు అత్యుత్సాహంతో మోడిపై చేసిన వ్యాఖ్యలు భాజపాలోని చంద్రబాబు వ్యతిరేక వర్గానికి బాగా కలిసివచ్చాయి. వెంటనే ఢిల్లీకి నివేదికలు కూడా చేరిపోయాయి.
అదే సమయంలో అమిత్ షా తెలుగురాష్ట్రాల్లో పర్యటించారు. గురువారం విజయవాడలో భాజపా సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి 13 జిల్లాల నుండి శ్రేణులను పిలిపించారు. ఇక్కడే చంద్రబాబు వ్యతిరేకవర్గం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా తాము మాత్రమే చెబితే సరిపోదని నిర్ణయించారు. పార్టీ శ్రేణులతో కూడా చెప్పించాలని అనుకున్నారు.
వేదికమీద నుండి వెంకయ్య మాట్లాడటానికి లేవగానే వెంకయ్య, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు మొదలయ్యాయి. ‘లీవ్ టిడిపి-సేవ్ బిజేపి‘ అని రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు మొదలుపెట్టారు. వెంకయ్య వద్దని వారించేకొద్దీ రెచ్చిపోయి నినాదాలు మొదలుపెట్టారు. ఇదంతా అమిత్ షా దృష్టిలో పడింది. దాంతో నేతలే కాదు శ్రేణులు కూడా టిడిపికి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం అమిత్ షా బుర్రలోకి బాగా ఎక్కినట్లే ఉంది.
అందుకే ఢిల్లీలో శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘ఏపిలో భాజపా ఒంటరిగా పోటీ చేయాలని కార్యకర్తలు సూచిస్తున్నారం’టూ చెప్పారు. అంటే వ్యతిరేకవర్గం వ్యూహం ఏ స్ధాయిలో వర్కవుట్ అయ్యిందో అర్ధమైంది కదా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.