ఏలిన వారి స్విస్ ఛాలెంజ్ విధానానికి ఎదురుదెబ్బ స్విస్ ఛాలెంజ్ ను ఆహ్వానిస్తూ తాజా నోటీపికేషన్ ప్రభుత్వం నిర్ణయం తాజా నోటిపికేషన్ పై కూడా అవసరమయితే కోర్టుకు రావచ్చు
అమరావతి నిర్మాణం కొన్ని కంపెనీలకు లబ్ది చేకూర్చే విధంగా సాగుతూ ఉందన్న అనుమానాలు నిజమేనేమో అనిపించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మధ్య జారీ చేసిని స్విస్ చాలెంట్ నోటీఫికేషన్ ను ఉపసంహిరించుకుంటానని వెల్లడించింది.
అమరావతి కోర్ క్యాపిటల్ అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ (స్విస్ చాలెంజ్) జారీ చేసిన నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
మరింత వివరంగా మరొక తాజా నోటీఫికేషన్ జారీ చేస్తామని అడ్వ కేట్ జనరల్ కోర్టు హామీ ఇవ్వడంతో నాయయూర్తి కోర్టు ముందు విచారణలో ఉన్నపిటిషన్లను కొట్టి వేశారు. అయితే, భవిష్యత్తులో ఈ వ్యవహారం మళ్ల కోర్టుకు రాదన్న గ్యారంటీ మాత్రం లేదు. ఎందుకంటే, అవసరమయితే, పిటిషనర్లు మళ్లీ న్యాయం కోసం కోర్టుకురావచ్చని న్యాయమూర్తులు తలుపులు తెరిచి పెట్టారు.
అయితే, అమరావతి నిర్మాణానికిది పెద్ద దెబ్బ. ఎందుకంటే, తాజా నోటిఫి కేషన్ విడుదల చేసి, ఆ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసేందుకు మరి కొంత కాలం గడవు పడుతుంది. అంటే 2016 లో స్విస్ చాలెంజ్ విధానం ఖరారయ్యే అవకాశం కూడా లేదున్నమాట. ఒక వైపు ’ టార్గెట్ 2016’ అనే కాన్సెప్ట్ తో అమ రావతి నిర్మాణం 2018 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రటిస్తుంటే మరొక వైపు స్విస్ చాలెంజ్ విధానానికే చాలెంజ్ లు ఎదురవుతూ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబలింగ్ (ఏపీఐడీఈ) చట్టం 2001కు చట్ట సవరణలు చేసి ఆర్డినెన్స్ జారీ చేశామని, ఈ నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ జారీ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. తాజాగా నోటిఫికేషన్ వస్తున్నపుడు పాత నోటిఫికేషన్ను అ నుసరించి వేసిన రిట్ పిటిషన్లు ,ప్రభుత్వం, సీఆర్‌డీఏలు దాఖలు చేసి రిట్ అప్పీళ్లకు విలువ ఉండదని చెబుతూ ఈ విచారణ మొత్తానికి ముగింపు పలుకుతున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఏపీఐడీఈ చట్ట సవరణల ఆర్డినెన్స్, తాజా నోటిఫికేషన్ జారీకి అడ్వకేట్ జనరల్ చేసిన హామీలను హైకోర్టు రికార్డ్ చేసింది.
ప్రభుత్వం ఇచ్చే తాజా నోటిఫికేషన్ అనుమానాలుంటే, పిటిషనర్లు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి రిట్ పిటిషన్లలో లేవనెత్తిన అంశాలను తిరిగి లేవనెత్తవచ్చునని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి ప్రాంతంలో దాదాపు 7 చదరపు కిలోమీటర్ల పరిధిలో పరిపాలనా రాజదానిని అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్-సెంబ్
ఈ పిటిషన్లను విచారించిన స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపిస్తూ సెప్టెంబర్ 12 న నోటిఫికేషన్ల అమలుపై స్టే విధించారు. ఈ స్టే ఉత్తర్వులను సవా లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏలు వేర్వేరుగా రిట్ అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం, సీఆర్‌డీఏల తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌వాదనలు వినిపించారు..
