తిరుపతి: డాక్టర్ శిల్ప ఆత్మహత్య వివాదం సద్దుమణగక ముందే తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఎస్వీ మెడికల్ కాలేజీకి చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతున్న గీతిక తిరుపతి శివజ్యోతినగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని మరణించింది.

ఆత్మహత్య చేసుకున్న గీతిక స్వస్థలం కడప జిల్లాగా గుర్తించారు. విద్యార్థిని మృతిపై తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై మెడికల్ కాలేజీ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.

తాజాగా మరో విద్యార్థినిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్రమైన కలకలం రేపుతోంది.