‘‘కే’’ ట్యాక్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆయన కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మీపై మరో కేసు నమోదైంది.

నరసరావుపేటలో ఓ లేఔట్ అనుమతి కోసం రూ.15 లక్షలు ఇవ్వాలని కోడెల కుమార్తె బెదిరింపులకు దిగారని కోటిరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటగా రూ. 10 లక్షలకు సెటిల్‌మెంట్ అయిందని, మళ్లీ ఇప్పుడు మిగిలిన ఐదు లక్షలు కూడా ఇవ్వాలని విజయలక్ష్మీ బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ ఫిర్యాదుతో కలిపి కోడెల కుటుంబంపై అందిన ఫిర్యాదుల సంఖ్య ఏడుకు చేరాయి. రానున్న రోజుల్లో మరింత మంది ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని నరసరావుపేటలో జోరుగా చర్చ నడుస్తోంది.