ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఈ రోజు అధికార వైసీపీ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల సందడి నేపథ్యంలో మండలికి పోటీ చేసే వైసిపి అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ఉన్న సంగతి తెలిసిందే. వైసిపి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ శాసనమండలికి పోటీ చేసే వైసిపి అభ్యర్థులను సామాజిక వర్గాల వారీగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ మేరకు సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్టుగా సమాచారం.
శాసనమండలి అభ్యర్థులలో ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ముఖ్య మంత్రి పెద్దపీట వేయనున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై పూర్తి కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలిసింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ప్రముఖ స్థానం ఉండాలని ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం సూచించినట్లుగా ఈ ఎంపిక ఉంటుందని అనుకుంటున్నారు.
వేడెక్కిన రాజకీయం.. కన్నా అనుచరుడితో మంత్రి అంబటి రహస్య భేటీ, సత్తెనపల్లిలో ఏం జరుగుతోంది..?
ఈ లిస్టులో పరిశీలనలో ఉన్న కొన్ని పేర్ల లిస్టు బయటికి వచ్చింది.. దీని ప్రకారం.. స్థానిక సంస్థల్లో...
- తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ (అమలాపురం)
- నెల్లూరు నుంచి మేరుగ మురళీధర్ ( గూడూరు)
- కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ,
- కడప నుంచి మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డి (జమ్మలమడుగు)
- అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేక ఆయన భార్యగానీ, చైర్మన్ రంగన్న, నవీన్ నిశ్చల్
- పశ్చిమగోదావరి జిల్లాలో వంకా రవీంద్ర లేదా జి నాగబాబు
- శ్రీకాకుళంలో నర్త రామారావు లేదా నీలకంఠ నాయుడు
ఎమ్మెల్యేల, గవర్నర్ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్ (రెన్యువల్)
- మర్రి రాజశేఖర్
- పోతుల సునీత (రెన్యువల్)
- గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, చల్లా శ్రీలక్ష్మి
- శ్రీకాకుళం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం
- ప్రకాశం జిల్లా నుంచి జంకె వెంకటరెడ్డి, రావి రామనాథం బాబు
ముస్లింలకు వచ్చేసరికి..
- గుంటూరు నుంచి జియావుద్దీన్
విజయవాడలో బొప్పన భువన్ కుమార్ తదితల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ అభ్యర్థుల జాబితాపై సోమవారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల అభ్యర్థులను మధ్యాహ్నం ప్రకటిస్తారు. ఏపీలో 16 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరగబోతున్న సంగతి తెలిసిందే.
