ఆంధ్రప్రదేశ్ లో అర్థరాత్రి గవర్నర్ ముఖ్య కార్యదర్శిపై వేటు వేయడం సంచలనంగా మారింది. ఆర్పీ సిసోడియా స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ నియామితులయ్యారు. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకం అయ్యారు. ఆర్పీ సిసోడియాను జీఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా హరిజవహర్ లాల్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు గవర్నర్ కార్యదర్శి పదవి నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆర్పీ సిసోడియాను తొలించారు. 

ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని మాత్రమే ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సీనియర్ అధికారి అయిన సిసీడియాను ఇంత హాడావుడిగా తొలగించడం వెనుక ఏం జరిగిందనేది ఊహాగానాలకు తెరలేపింది. శుక్రవారం అర్థరాత్రి ఈ మేరకు ఇచ్చిన జీవోలో గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా సిసోడియాను తప్పించారు. ఆయన స్థానంలో మరో సీనియర్ అధికారిని నియమించారు. 

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్.. ఆళ్లగడ్డలో పోలీసుల మోహరింపు

ప్రస్తుతం కార్యదర్శిగా నియామకం అయిన అనిల్ సింఘాల్ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన బాధ్యతలను హరిజవహర్ లాల్ కు అదనపు బాధ్యతలుగా అప్పగించారు. దీంతో ఈ నియామాకలు, బదిలీలు సంచలనంగా మారాయి.