Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్.. ఆళ్లగడ్డలో పోలీసుల మోహరింపు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆళ్ళగడ్డలోని భూమా అఖిలప్రియ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

Police house arrest Former minister bhuma akhila priya in allagadda
Author
First Published Feb 4, 2023, 10:38 AM IST

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆళ్ళగడ్డలోని భూమా అఖిలప్రియ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాట్లు చేశారని భూమా అఖిలప్రియ ప్రైవేటు కార్యదర్శికి గత రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 30 యాక్ట్ అమల్లో ఉన్నందున అఖిలప్రియకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. ఇక, అఖిలప్రియను బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆమె అనుచరులు మండిపడుతున్నారు.

వివరాలు.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి చేసిన ఆరోపణలపై ఆధారాలతో మీడియా ముందుకు రావాలని భూమా అఖిలప్రియ సవాలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఈరోజు శిల్పా రవిచంద్రారెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు బయటపెడతానని కూడా అఖిల ప్రియ చెప్పారు. రవిచంద్రారెడ్డి నంద్యాల గాంధీ చౌక్ వద్దకు రావాలని.. అక్కడ ఆయన అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని సవాలు చేశారు. 

శిల్పా రవిచంద్రారెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని కూడా తనకు తెలిసిందని భూమా అఖిలప్రియ అన్నారు. అంతేకాదు ఆయన పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఆయన చూపు టీడీపీ వైపు ఉందని అన్నారు. టీడీపీలో చేరడానికి రవిచంద్రారెడ్డి వేదిక సిద్ధం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. నంద్యాలలోని గాంధీ చౌక్ వద్దకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి అక్రమాల చిట్టాను తాను తీసుకు వస్తానని అన్నారు. తాను అక్రమాలకు పాల్పడ్డానని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios