Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చెయ్యడంతోనే చంపేశాడు : జ్యోతి హత్యకేసులో నిందితుల అరెస్ట్

తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ సాయంతో జ్యోతిని ఇనుపరాడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో జ్యోతి అక్కడికక్కడే దుర్మరణం చెందిందని ఆ తర్వాత శ్రీనివాస్ తనపై కూడా దాడి చేసుకుని హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని స్పష్టం చేశారు. 25 కుట్లు పడేలా 10 సెంటీమీటర్ల మేర తన తలపై శ్రీనివాస్ దాడి చేసుకున్నారని తెలిపారు. 
 

angadi jyothi murder case :accused srinivas, pawan kalyan arrest
Author
Guntur, First Published Feb 23, 2019, 12:37 PM IST

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలనం రేపిన జ్యోతి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోమని జ్యోతి శ్రీనివాస్ పై ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఆర్థిక సమస్యల కారణంగా హత్యకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీ విజయరావు స్పష్టం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఎస్సీఎస్టీ పీవో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

అంగడి జ్యోతికి నిందితుడు శ్రీనివాస్, స్నేహితుడు కటారి పవన్ కళ్యాణ్ తో స్నేహితులు. అయితే శ్రీనివాస్, జ్యోతిలు చాలా దగ్గరయ్యారని పోలీసులు తెలిపారు. ఈనెల 11న సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళ్లిన ఆమె ప్రియుడు శ్రీనివాస్ కు ఫోన్ చేసినట్లు తెలిపారు. 

తనకు మెడిసిన్ కావాలని జ్యోతి మెసేజ్ చెయ్యడంతో శ్రీనివాస్ ఆమెను ఫాలో అయ్యారని అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్ విజువల్స్ లో ఉన్నాయని తెలిపారు. జ్యోతిని నిందితుడు శ్రీనివాస్ తన బైక్ పై నవుడూరు తీసుకు వెళ్లారని అలాగే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లాడని చెప్పారు. 

తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ సాయంతో జ్యోతిని ఇనుపరాడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో జ్యోతి అక్కడికక్కడే దుర్మరణం చెందిందని ఆ తర్వాత శ్రీనివాస్ తనపై కూడా దాడి చేసుకుని హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని స్పష్టం చేశారు. 25 కుట్లు పడేలా 10 సెంటీమీటర్ల మేర తన తలపై శ్రీనివాస్ దాడి చేసుకున్నారని తెలిపారు. 

హత్య జరిగిన ప్రాంతానికి ఏ2 నిందితుడు పవన్ కళ్యాణ్ ఫోన్ తీసుకెళ్లకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. హత్య జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లిపోయాడని కాసేపటికి శ్రీనివాస్ ఫోన్ చేసి తమకు యాక్సిడెంట్ అయ్యిందని ఫోన్ చేసినట్లు తెలిపారు. 

దీంతో పవన్ కళ్యాణ్ దగ్గర్లోని సిసింద్రీ రెడ్డి అనే వ్యక్తికి శ్రీనివాస్ కు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి అతని దగ్గర ఉన్న బైక్ తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ కేసును తప్పుదోవ పట్టించేందుకు ఎంతో ప్రయత్నించారని తెలిపారు. ఇకపోతే నిందితుడు శ్రీనివాస్ ఫోన్ లో న్యూడ్ వీడియోస్ ఉన్నాయని తెలిపారు. 

అలాగే సోషల్ మీడియాలో తనకు తెలియకపోయినా వారిని శ్రీనివాస్ వేధించేవారని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. అతని ఫోన్ ను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. ఫేస్ బుక్ లో ఛాటింగ్ చెయ్యడం, వీడియో కాల్స్ చేస్తూ వేధించడం గుర్తించినట్లు తెలిపారు. 

కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని డీఎస్పీ ర్యాంక్ అధికారితో విచారణ కొనసాగుతుందన్నారు. నిందితుడు శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అతనిని అదుపులోకి తీసుకుని మరింత విచారిస్తామన్నారు. 

అలాగే కేసులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇకపోతే ఈనెల 11న మంగళగిరి శివారులో జ్యోతిని ప్రియుడు శ్రీనివాస్ తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ సాయంతో హత్య చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios