Asianet News TeluguAsianet News Telugu

భర్త కాపురానికి తీసుకువెళ్లలేదని.. వీడియోకాల్ చేసి ఉరేసుకున్న భార్య....

దంపతుల మధ్య కొంత కాలంగా family disputesపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త పై అలిగిన రమ్య శ్రీ కొద్ది రోజుల కిందట పుట్టింటికి వచ్చేసింది.తనను కాపురానికి తీసుకెళ్లాలని రమ్యశ్రీ కొద్దిరోజులుగా భర్తను ఫోన్ చేసి అడుగుతోంది. చందు నాయక్ స్పందించలేదు.

andhrapradesh woman hangs herself while on video call with husband
Author
Hyderabad, First Published Oct 30, 2021, 2:12 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చిత్తూరు :  భర్తకు వీడియో కాల్ చేసిన భార్య లైవ్లో ఉరేసుకున్న సంఘటన మదనపల్లిలో జరిగింది. Madanapalle  టూ టౌన్ పోలీసుల కథనం మేరకు …  అనంతపురం జిల్లా బాబే నాయక్ తండాకు చెందిన  చక్రి నాయక్,  కమలమ్మ దంపతులు కొంతకాలం కిందట ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వలసొచ్చారు.

పట్టణంలోని ఎస్బిఐ కాలనీ ఎక్స్టెన్షన్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. కాగా చక్రే నాయక్ వాచ్మెన్ గా,  కమలమ్మ ఇళ్ళల్లో పాచి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఒక్కగా నొక్క కుమార్తె రమ్య శ్రీ (24) ఏడేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం ఏలూరుకు చెందిన చందు నాయక్ తో వివాహం అయ్యింది.  

వీరికి 11 నెలల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య కొంత కాలంగా family disputesపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త పై అలిగిన రమ్య శ్రీ కొద్ది రోజుల కిందట పుట్టింటికి వచ్చేసింది.

తనను కాపురానికి తీసుకెళ్లాలని రమ్యశ్రీ కొద్దిరోజులుగా భర్తను ఫోన్ చేసి అడుగుతోంది. చందు నాయక్ స్పందించలేదు. ఇదిలా ఉండగా రమ్యశ్రీ శుక్రవారం భర్తకు video call చేసి కాపురానికి తీసుకెళ్లాలని కోరింది. 

అయితే భర్త ఏ విషయం చెప్పకపోవడంతో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. దీంతో చందు వెంటనే అత్త కమలమ్మ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాగా ఇళ్లల్లో పనులు చేసేందుకు వెళ్లిన ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకుని ఫ్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి  బిగ్గరగా కేకలు వేసింది.  

స్థానికులు వచ్చి రమ్యశ్రీని చున్నీ తీసి, కిందికి దించి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అల్లుడు వేధింపుల కారణంగానే తన బిడ్డ suicide చేసుకుందని రమ్యశ్రీ తల్లి పోలీసులకు చెప్పింది.

గతంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పేర్కొంది.  ఆ తరువాత మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రమోహన్ చెప్పారు. 

రెండో రోజు కుప్పంలో చంద్రబాబు పర్యటన..!

మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం...
మాజీ Miss Telangana కలక భవాని అలియాస్ Hasini మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను కాపాడిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది.

శుక్రవారం నాడు ఆమె నందిగామ సమీపంలోని Keesara బ్రిడ్జి పై నుండి మున్నేరులో దూకింది.వెంటనే ఆమెను గుర్తించిన స్థానికులు మున్నేరులోకి దూకి ఆమెను కాపాడారు. మూడు రోజుల వ్యవధిలోనే ఆమె రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతుంది.

హాసిని బుధవారం నాడు రాత్రి పదిన్నర గంటల సమయంలో  చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొంటూ ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేశారు.  తల్లిదండ్రులు స్నేహితులు ఫోన్ చేస్తున్నా కూడా ఆమె పట్టించుకోలేదు. తాను చెప్పాలనుకొన్న విషయాలు చెప్పి స్టూల్ తన్నేసింది. అయితే లైవ్ లో ఈ దృశ్యాలను చూసిన ఆమె స్నేహితుడు 100 ఫోన్ చేశారు. నారాయణగూడ పోలీసులు హిమాయత్‌నగర్ లో ఆమె ఉండే ఇంటికి చేరుకొన్నారు. అయితే ఆమె ఫ్యాన్ కు బిగించుకొన్న చున్నీ ముడి ఊడిపోయి మంచంపై పడిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios