రెండో రోజు కుప్పంలో చంద్రబాబు పర్యటన..!
రాత్రంతా ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ వద్ద బాబు బస్సులోనే బస చేశారు. కుప్పంలో చంద్రబాబు రెండవ రోజు పర్యటన కోసం పోలీసులు భారీగా మోహరించారు

Chandrababu
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్నారు. శనివారం రెండో రోజు సైతం ఆయన కుప్పంలోనే పర్యటిస్తుండటం గమనార్హం.
chandrababu
రాత్రంతా ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ వద్ద బాబు బస్సులోనే బస చేశారు. కుప్పంలో చంద్రబాబు రెండవ రోజు పర్యటన కోసం పోలీసులు భారీగా మోహరించారు
chandrababu
నిన్నటి రోజు బహిరంగ సభలో పోలీసుల భద్రతా ఏర్పాట్లపై చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
chandrababu
కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పరిణామాల మేరకు స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఇవాళ ఆయన పర్యటనకు భారీగా పోలీసు భద్రతను పెంచింది. చంద్రబాబును కలసి తమ సమస్యలను విన్నవించుకుని, వినతులు ఇచ్చేందుకు భారీ సంఖ్యలో ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ వద్దకు బాధిత ప్రజలు చేరుకున్నారు.