Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కరోనా వ్యాక్సిన్ కి ముహుర్తం ఫిక్స్

ఈ నెల 25 నుంచి కోటి మందికి టీకా పంపిణీ చేస్తామని ట్వట్టర్ వేదికగా ప్రకటించారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే జగన్‌ ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది

Andhrapradesh  Set To Distribute  Corona Virus vaccine
Author
Hyderabad, First Published Dec 16, 2020, 12:29 PM IST

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి నుంచి ఉపశమనం ఎప్పుడు లభిస్తుందా అని అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. కాగా.. వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. వ్యాక్సిన్ అందించే రోజుని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ నెల 25 నుంచి కోటి మందికి టీకా పంపిణీ చేస్తామని ట్వట్టర్ వేదికగా ప్రకటించారు విజయసాయి రెడ్డి. ఇప్పటికే జగన్‌ ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఆదేశాల ప్రకారమే 4వేల 762 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణికి ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు సమాచారం.

 అయితే.. ఏ వ్యాక్సిన్ ఇస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఫైజర్‌, భారత్‌బయోటెక్‌ వ్యాక్సిన్‌లకు ఎమర్జెన్సీ యూసేజ్‌కి కేంద్రం ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఏ వ్యాక్సిన్ ఇవ్వనున్నారన్నది తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఫైజర్‌కు అనుమతిస్తే టీకా ఖరీదు 2వేల 5వందల రూపాయల వరకూ ఉంటుందంటున్నారు. అదే సీరమ్ ప్రపోజ్ చేస్తున్న రేటయితే 250 రూపాయలు ఉండొచ్చంటున్నారు. మరి కేంద్రం ఓకే చెప్పేది ఏ వ్యాక్సిన్‌కి. ఏపీ ఏ వ్యాక్సిన్ రాబోతోంది. వచ్చినా ఫ్రీగా ఇస్తారా లేక.. ఏమైనా చార్జ్ చేస్తారా.. తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios