అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 0381  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 68 వేల 064 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 04 మంది కరోనా మరణించారు. కరోనాతో అనంతపురం, చిత్తూరు, కృష్ణా,విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6992కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,00,57,854 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  గత 24 గంటల్లో 40,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 1381మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో934 మందికి కరోనా నుండి కోలుకొన్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 53వేల 232 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 07,840 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 21,చిత్తూరులో 31,తూర్పుగోదావరిలో 045, గుంటూరులో 035, కడపలో 026, కృష్ణాలో 070, కర్నూల్ లో 012, నెల్లూరులో 019, ప్రకాశంలో 07, శ్రీకాకుళంలో 010, విశాఖపట్టణంలో 011, విజయనగరంలో 020,పశ్చిమగోదావరిలో 074 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,691, మరణాలు 589
చిత్తూరు  -83,674,మరణాలు 827
తూర్పుగోదావరి -1,22,291, మరణాలు 636
గుంటూరు  -72,882, మరణాలు 649
కడప  -54,352,మరణాలు 450
కృష్ణా  -45,412, మరణాలు 637
కర్నూల్  -60235, మరణాలు 486
నెల్లూరు -61,424, మరణాలు 495
ప్రకాశం -61,453, మరణాలు 577
శ్రీకాకుళం -45,461, మరణాలు 346
విశాఖపట్టణం  -58163, మరణాలు 541
విజయనగరం  -40,689,మరణాలు 235
పశ్చిమగోదావరి -92,442, మరణాలు 524