విభ‌జ‌న‌తో ఆంధ్ర ప్రాంతానికి తీర‌ని అన్యాయం.  రాజ్యసభ ఛైర్మన్ గా రాజ్య‌సభకు తిరిగి పూర్వ వైభవం. పార్లమెంటులో దేశ భవిష్యత్తును మార్చేలా అర్థవంతమైన చర్చలు జరగాలి. పార్ల‌మెంట్ లో రాజకీయ పార్టీలన్నీ రాజకీయ విరోధులే, తప్ప శత్రువులు కావు

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర ప్రాంతానికి తీర‌ని అన్యాయం జ‌రిగింద‌న్నారు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు. ఇదే విభ‌జ‌న 1980లో జ‌రిగి ఉంటే ఇరు ప్రాంతాలు నేటికి అభివృద్ది చేందేవ‌ని, ఇప్పుడు విభ‌జ‌న జ‌రిగి అన్ని రంగాల్లో ఆంధ్ర, రాయ‌ల‌సీమ ప్రాంతాలు న‌ష్ట‌పోయియావ‌ని ఆయ‌న తెలిపారు. అమరావతిలో ఆయనకు ఈ రోజు ఏపీ ప్ర‌భుత్వం పౌర సన్మానం చేసింది. అందులో ఆయ‌న ప్ర‌సంగించారు.

 రాజ్యసభ ఛైర్మన్ గా రాజ్య‌సభకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తానని... శ‌ప‌ధం చేశారు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు. ఉప రాష్ట్ర‌ప‌తిగా భాద్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత‌ తిరిగి జ‌న్మ‌భూమికి రావడం చాలా ఆనంధంగా ఉంద‌నని, అయితే కొంత విచారంగా కూడా ఉంద‌న్నారు వెంకయ్య.. ఇక మీద‌ట త‌రుచుగా ప్ర‌జ‌ల‌తో త‌న అభిప్రాయాల‌ను తెల‌ప‌లేన‌ని పెర్కొన్నారు. చిన్న తనం నుంచి తనకు పట్టుదల ఎక్కువని... ఏదైనా అనుకుంటే సాధించేదాకా విశ్రమించలేదని... మనసు, శరీరాన్ని వంచి పని చేసేవాడినని వెంకయ్యనాయుడు తెలిపారు. విద్యార్థి ద‌శ నుంగి నేటి వ‌ర‌కు ఎన్నో ఉద్య‌మాలు చేశాను, ఎన్నో రాజ‌కీయాల‌ను చేశాను, నేడు అందరి అభిమానంతో దేశంలోనే రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి పదవి తనకు దక్కడం, తాను చేసుకున్న అదృష్టమని తెలిపారు.

పార్లమెంటులో దేశ భవిష్యత్తును మార్చేలా అర్థవంతమైన చర్చలు జరగాలని, అవినీతిని అంతమొందించేలా చట్టాలు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. చట్ట స‌భ‌లు ప్ర‌జ‌ల అభివృద్దికి మార్గాలు కావాలి, కాని తిలోధ‌కాలు కాకుడ‌ద‌ని పెర్కొన్నారు. చ‌ట్ట స‌భ‌లు స‌రిగ్గా ప‌ని చెయ్య‌డం లేద‌ని ప్ర‌జ‌లకు చాలా అసంతృప్తితో ఉన్నారు. అటువంటి ప‌క్షంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా కూలిపోయే అవకాశం ఉందని, ఈ పరిస్థితి తలెత్తకుండా కాపాడాల్సిన బాధ్యత చట్ట సభలపై ఉందని తెలిపారు. పార్ల‌మెంట్ లో రాజకీయ పార్టీలన్నీ రాజకీయ విరోధులే కాని, శత్రువులు కాదని... అందుకే, విమర్శలు చేసుకునేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు తమను ప్రశ్నిస్తారని, ప్రజల్లో తాము చులకన అవుతామనే భయం ప్రజాప్రతినిధుల్లో ఉండాలని చెప్పారు.


రెండు విష‌యాలు చాలా సంతోషాన్ని క‌ల్గించాయి:

మొద‌టిది.. ప‌ల్లేల‌కు రోడ్లు వెయ్యాలని ఆనాడు ప్ర‌ధాని వాజ్‌పేయ్ కి సూచించింది తానే అని వెంక‌య్య‌ పెర్కొన్నారు. అందుకు ఫ‌లితంగా నేడు ప్ర‌ధాన మంత్రి స‌డ‌క్ యోజ‌న పేరు తో దేశ వ్యాప్తంగా రోడ్లు ల‌భించాయ‌న్నారు. రెండ‌వ‌ది.. దేశంలో ప్ర‌ధాని మోదీ హాయాంలో ల‌క్ష‌లాది ఇళ్లు నిర్మించే అవ‌కాశం నాకు ల‌భించిందన్నారు. ఈ రెండు ప‌నులు త‌న‌కి చాలా సంతోషం క‌ల్గిస్తాయ‌ని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు పెర్కొన్నారు.

మరిన్ని లేటెస్ట్ విశేషాల కోసం కింద క్లిక్ చేయండి