ఆంధ్రా యూనివర్సిటీలో ఓ ప్రొపెసర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఉన్నత విద్యాశాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు తన ఆఫీసులోనే ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్పష్టంగా వీడియోలు బైటపడినా విద్యాశాఖ ఆయనపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనపై వచ్చిన అభియోగాలను కొట్టిపారేసి విద్యాశాఖ నియమించిన కమిటీ క్లీన్ చీట్ ఇవ్వడం వివాదంగా మారుతోంది.

 ఆంధ్ర వర్సిటీలో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ జె. రామానాయుడు 2012 డిసెంబర్‌ 7న తన కార్యాలయంలోనే ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సర్టిఫికేట్ల కోసం వచ్చిన ఓ యువతిని తన ఆఫీసులోనే లైంగికంగా వేధించినట్లు ఫొటోలతో సహా బైటికివచ్చాయి. దీనిపై వెంటనే స్పందిచిన యూనివర్సిటీ అధికారులు అతడిని స్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఆరోపణలపై నిజానిజాలను తేల్చడానికి 2013 లె ఓ కమిటీ వేశారు. అయితే ఈ కమిటీ బైటికివచ్చిన వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించగా అవి నిజమైనవే అని తేలింది. అంతేకాకుండా ఈ ఘటనపై విచారణ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి.వి.రంగరాజును నియమించారు. ఒక ప్రొఫెసర్‌ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం క్షమించరాని నేరమంటూ ఓ నివేదిక సమర్పించారు. 

దీంతో రామునాయుడిని ప్రొఫెసర్‌ హోదా నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా తగ్గించడం వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఇతడు తనపై సస్పెన్షన్‌ ఎత్తివేసి  ప్రొఫెసర్‌గా మళ్లీ నియమించాలంటూ యూనివర్సీటీకి అభ్యర్థన పెట్టుకున్నాడు. దీనిపై మళ్లీ ఓ కమిటీని యూనివర్సిటీ  పాలకమండలి నియమించింది.అయితే ఈ కమిటీ ప్రొపెసర్ కు క్లీన్ చీట్ ఇవ్వడంతో  మళ్లీ  రామానాయుడిని ప్రొపెసర్ గా నియమించారు.